యెహోవా చెప్పే మాట ఇదే:
“యూదా వారు చేసిన మూడు పాపాల గురించి,
వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను,
ఎందుకంటే వారు యెహోవా ఉపదేశాలను విసర్జించారు,
ఆయన శాసనాలను పాటించలేదు,
వారి పూర్వికులు అనుసరించిన అబద్ధ దేవుళ్ళను నమ్ముకొని,
వారి వల్ల దారి తప్పారు.