“ ‘ఈ ప్రజల దగ్గరకు వెళ్లి చెప్పు,
“మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్థం చేసుకోరు;
ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు.”
ఎందుకంటే ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి;
వారు చెవులతో వినరు,
వారు కళ్లు మూసుకున్నారు.
లేకపోతే వారు తమ కళ్లతో చూసి,
చెవులతో విని,
తమ హృదయాలతో గ్రహించి, నా వైపుకు తిరుగుతారు,
అప్పుడు నేను వారిని స్వస్థపరుస్తాను.’