ఆ స్త్రీలు నాట్యం చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ,
“సౌలు వేయిమందిని
దావీదు పదివేలమందిని చంపారు”
అని పాడారు.
ఆ మాటలు సౌలుకు నచ్చలేదు కాబట్టి అతడు చాలా కోపం తెచ్చుకుని, “వారు దావీదుకు పదివేలమంది, నాకు వేయిమంది అంటున్నారు; రాజ్యం కాకుండా అతడు మరేం తీసుకోగలడు?” అనుకున్నాడు.