1
1 కొరింథీ పత్రిక 13:4-5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది. అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.
సరిపోల్చండి
Explore 1 కొరింథీ పత్రిక 13:4-5
2
1 కొరింథీ పత్రిక 13:7
అది అన్నిటిని కాపాడుతుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని సహిస్తుంది.
Explore 1 కొరింథీ పత్రిక 13:7
3
1 కొరింథీ పత్రిక 13:6
ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది.
Explore 1 కొరింథీ పత్రిక 13:6
4
1 కొరింథీ పత్రిక 13:13
విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు నిలిచి ఉంటాయి. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమే.
Explore 1 కొరింథీ పత్రిక 13:13
5
1 కొరింథీ పత్రిక 13:8
ప్రేమ ఎప్పుడు విఫలం కాదు. అయితే ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానం గతించిపోతుంది.
Explore 1 కొరింథీ పత్రిక 13:8
6
1 కొరింథీ పత్రిక 13:1
మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను.
Explore 1 కొరింథీ పత్రిక 13:1
7
1 కొరింథీ పత్రిక 13:2
నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగి ఉన్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే.
Explore 1 కొరింథీ పత్రిక 13:2
8
1 కొరింథీ పత్రిక 13:3
నాకున్న సంపాదనంతా పేదలకు ఇచ్చివేసి, మెప్పు కోసం నా శరీరాన్ని కష్టానికి అప్పగించినా నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమి లేదు.
Explore 1 కొరింథీ పత్రిక 13:3
9
1 కొరింథీ పత్రిక 13:11
నేను చిన్నబిడ్డగా ఉన్నపుడు చిన్నబిడ్డగా మాట్లాడాను, చిన్నబిడ్డగా తలంచాను, చిన్నబిడ్డగా ఆలోచించాను, కాని నేను పెద్దవాన్ని అయినప్పుడు బాల్యపు పద్ధతులు వదిలేశాను.
Explore 1 కొరింథీ పత్రిక 13:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు