1
సామెతలు 11:25
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దీవించే మనస్సు గలవారు వృద్ధిచెందుతారు, నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడతాయి.
సరిపోల్చండి
సామెతలు 11:25 ని అన్వేషించండి
2
సామెతలు 11:24
ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు కలరు; ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తూ దరిద్రులైన వారు కలరు.
సామెతలు 11:24 ని అన్వేషించండి
3
సామెతలు 11:2
గర్వము వెంబడి అవమానం వస్తుంది, కాని వినయం వెంట జ్ఞానం వస్తుంది.
సామెతలు 11:2 ని అన్వేషించండి
4
సామెతలు 11:14
ఎందుకంటే మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల దేశం పడిపోతుంది, కాని అనేక సలహాదారుల ద్వారా విజయం కలుగుతుంది.
సామెతలు 11:14 ని అన్వేషించండి
5
సామెతలు 11:30
నీతిమంతుల ఫలం జీవవృక్షంలా ఉంటుంది, జ్ఞానంగలవారు జీవితాలను కాపాడతారు.
సామెతలు 11:30 ని అన్వేషించండి
6
సామెతలు 11:13
పుకారు ఆత్మవిశ్వాసాన్ని మోసం చేస్తుంది, కాని నమ్మదగినవారు రహస్యాలను దాస్తారు.
సామెతలు 11:13 ని అన్వేషించండి
7
సామెతలు 11:17
దయగలవారు తమకు తాము మేలు చేసుకుంటారు, కాని క్రూరులు తమ మీదికి తామే శరీరమునకే పతనం తెచ్చుకుంటారు.
సామెతలు 11:17 ని అన్వేషించండి
8
సామెతలు 11:28
సంపదను నమ్ముకునేవారు పాడైపోతారు, నీతిమంతులు చిగురాకువలే అభివృద్ధి పొందుతారు.
సామెతలు 11:28 ని అన్వేషించండి
9
సామెతలు 11:4
ఉగ్రత దినాన సంపద విలువలేనిది, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.
సామెతలు 11:4 ని అన్వేషించండి
10
సామెతలు 11:3
యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది, కానీ నమ్మకద్రోహులు వారి వంచనతో నాశనమవుతారు.
సామెతలు 11:3 ని అన్వేషించండి
11
సామెతలు 11:22
మంచిచెడులు తెలియని అందమైన స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మివంటిది.
సామెతలు 11:22 ని అన్వేషించండి
12
సామెతలు 11:1
మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు, న్యాయమైన తూకం అంటే ఆయనకు ఇష్టము.
సామెతలు 11:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు