“ఎక్కువగా దేవదారు కలిగి ఉండడం
అతడు నీతిని న్యాయాన్ని చేసినప్పుడు,
నీ తండ్రికి అన్నపానాలు లేవా?
అతడు సరియైనది, న్యాయమైనది చేశాడు,
అతనికి అంతా బాగానే జరిగింది కదా.
అతడు పేదలు, అవసరతలో ఉన్న వారి పక్షంగా వాదించాడు,
కాబట్టి అంతా బాగానే జరిగింది.
నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.