1
యెషయా 54:17
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు, నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే, నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
సరిపోల్చండి
Explore యెషయా 54:17
2
యెషయా 54:10
పర్వతాలు కదిలినా కొండలు తొలగిపోయినా నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన తొలిగిపోదు” అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు.
Explore యెషయా 54:10
3
యెషయా 54:4
“భయపడకు; నీవు సిగ్గుపరచబడవు అవమానానికి భయపడకు; నీవు అవమానపరచబడవు. నీ యవ్వనపు సిగ్గును నీవు మరచిపోతావు నీ వైధవ్యపు నిందను ఇకపై జ్ఞాపకం చేసుకోవు.
Explore యెషయా 54:4
4
యెషయా 54:5
నిన్ను సృష్టించినవాడే నీ భర్త ఆయన పేరు సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు; ఆయన భూమి అంతటికి దేవుడు.
Explore యెషయా 54:5
5
యెషయా 54:2
“నీ గుడారపు స్థలాన్ని పెద్దగా చేయి. నీ గుడారపు తెరలను ఆటంకం లేకుండా ముందుకు పొడిగించు నీ త్రాళ్లను పొడవుగా చేయి. నీ మేకుల్ని లోతుగా దిగగొట్టు.
Explore యెషయా 54:2
6
యెషయా 54:13
యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.
Explore యెషయా 54:13
7
యెషయా 54:8
తీవ్రమైన కోపంలో కొంతకాలం నీవైపు నేను చూడలేదు కాని నిత్యమైన కృపతో నీపై జాలి చూపిస్తాను” అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు.
Explore యెషయా 54:8
8
యెషయా 54:7
“కొద్ది కాలం నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ గొప్ప జాలితో నేను నిన్ను తిరిగి చేర్చుకుంటాను.
Explore యెషయా 54:7
9
యెషయా 54:9
“ఇది నాకు నోవహు కాలంలోని జలప్రళయంలా ఉంది, జలప్రళయం భూమి మీదికి ఇకపై రాదని నోవహు కాలంలో నేను ప్రమాణం చేశాను. అలాగే ఇప్పుడు నీ మీద కోప్పడనని, ఎన్నడు నిన్ను గద్దించనని నేను ప్రమాణం చేశాను.
Explore యెషయా 54:9
10
యెషయా 54:12
రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు, మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను.
Explore యెషయా 54:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు