1
గలతీ పత్రిక 6:9
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మంచి చేయడంలో మనం అలసి పోవద్దు ఎందుకంటే మానక చేస్తే తగిన కాలంలో మనం పంటను కోస్తాము.
సరిపోల్చండి
గలతీ పత్రిక 6:9 ని అన్వేషించండి
2
గలతీ పత్రిక 6:10
కాబట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ప్రజలందరికి మరి ముఖ్యంగా విశ్వాసుల కుటుంబానికి చెందిన వారికి మంచి చేద్దాము.
గలతీ పత్రిక 6:10 ని అన్వేషించండి
3
గలతీ పత్రిక 6:2
ఒకరి భారాలను ఒకరు మోయండి, ఈ విధంగా మీరు క్రీస్తు ధర్మాన్ని నెరవేరుస్తారు.
గలతీ పత్రిక 6:2 ని అన్వేషించండి
4
గలతీ పత్రిక 6:7
మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడరు. ఒకరు దేన్ని విత్తుతారో దాని పంటనే కోస్తారు.
గలతీ పత్రిక 6:7 ని అన్వేషించండి
5
గలతీ పత్రిక 6:8
తమ శరీరాలను సంతోషపరచడానికి విత్తేవారు తమ శరీరం నుండి నాశనమనే పంట కోస్తారు. తమ ఆత్మను సంతోషపరచడానికి విత్తేవారు తమ ఆత్మ నుండి నిత్యజీవమనే పంటను కోస్తారు.
గలతీ పత్రిక 6:8 ని అన్వేషించండి
6
గలతీ పత్రిక 6:1
సహోదరీ సహోదరులారా, ఎవరైనా పాపంలో చిక్కుకొని ఉంటే, ఆత్మ వల్ల జీవిస్తున్న మీరు వారిని మృదువుగా సరియైన మార్గంలోనికి మరలా తీసుకురండి. అంతేకాక మీరు కూడా శోధనలో పడిపోవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.
గలతీ పత్రిక 6:1 ని అన్వేషించండి
7
గలతీ పత్రిక 6:3-5
ఎవరైనా తమలో ఏ గొప్పతనం లేకపోయినా తాము గొప్పవారమని భావిస్తే వారు తమను తామే మోసపరచుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ తమ పనులను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరులతో తమను పోల్చుకోకుండా కేవలం తమను బట్టి తామే గర్వపడగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి.
గలతీ పత్రిక 6:3-5 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు