“నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను.
“ఆయన జీవంగల దేవుడు.
ఆయన ఎల్లకాలం జీవిస్తారు;
ఆయన రాజ్యం నాశనం కాదు,
ఆయన అధికారం ఎప్పటికీ అంతం కాదు.
ఆయన రక్షిస్తారు, కాపాడతారు;
ఆకాశంలో, భూమి మీద
ఆయన సూచకక్రియలు అద్భుతాలు చేస్తారు.
ఆయనే దానియేలును
సింహాల నుండి కాపాడారు” అని వ్రాయించాడు.