1
2 రాజులు 2:9
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు” అన్నాడు. అందుకు ఎలీషా అన్నాడు, “నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు.”
సరిపోల్చండి
2 రాజులు 2:9 ని అన్వేషించండి
2
2 రాజులు 2:11
వారు కలిసి మాట్లాడుతూ నడుస్తూ వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా అగ్ని గుర్రాలతో ఉన్న అగ్ని రథం వచ్చి వారిద్దరిని వేరు చేసింది. ఏలీయా సుడిగాలిలో ఆకాశంలోకి పైకి వెళ్లిపోయాడు.
2 రాజులు 2:11 ని అన్వేషించండి
3
2 రాజులు 2:10
అందుకు ఏలీయా, “నీవు అడిగింది కష్టమైనది, అయితే నన్ను తీసుకువెళ్లే సమయంలో నీవు నన్ను చూస్తే నీవు దానిని పొందుకుంటావు, చూడకపోతే నీవు పొందుకోవు” అని చెప్పాడు.
2 రాజులు 2:10 ని అన్వేషించండి
4
2 రాజులు 2:14
ఎలీషా ఏలీయా మీద నుండి క్రిందపడ్డ పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీళ్లను కొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అన్నాడు. అతడు ఆ నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు కుడి వైపుకు ఎడమవైపుకు విడిపోగా అతడు అవతలి ఒడ్డుకు వెళ్లాడు.
2 రాజులు 2:14 ని అన్వేషించండి
5
2 రాజులు 2:12
ఎలీషా అది చూస్తూ, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు నీవే!” అని కేక పెట్టాడు. ఎలీషా అతన్ని మరలా చూడలేదు. అప్పుడు అతడు తాను వేసుకున్న బట్టలు రెండుగా చింపుకున్నాడు.
2 రాజులు 2:12 ని అన్వేషించండి
6
2 రాజులు 2:8
ఏలీయా తన పైవస్త్రాన్ని తీసి, మడతపెట్టి నీళ్లను కొట్టాడు, నీళ్లు కుడి వైపుకు, ఎడమవైపుకు చీలిపోయాయి, వారిద్దరు పొడినేల మీద నడిచివెళ్లారు.
2 రాజులు 2:8 ని అన్వేషించండి
7
2 రాజులు 2:1
యెహోవా ఏలీయాను ఆకాశంలోకి సుడిగాలిలో తీసుకెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు ఏలీయా, ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరారు.
2 రాజులు 2:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు