1
విలాప వాక్యములు 1:1
పవిత్ర బైబిల్
TERV
యెరూషలేము ఒకనాడు జనసందోహంతో కిటకిటలాడిన నగరం. కాని ఘోరంగా నిర్జనమయ్యింది! ఒకప్పుడు ప్రపంచ మహానగరాల్లో యెరూషలేము ఒక మహానగరం. కాని అది విధవరాలుగా అయింది. ఒకనాడామె నగరాలలో యువరాణిలా ఉన్నది. కాని ఆమె ఒక బానిసలా చేయబడింది.
సరిపోల్చండి
విలాప వాక్యములు 1:1 ని అన్వేషించండి
2
విలాప వాక్యములు 1:2
ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది. ఆమె కన్నీరు ఆమె చెక్కిళ్లపై ఉన్నాయి. ఆమెను ఓదార్చటానికి ఎవ్వరూ లేరు. ఆమెతో సఖ్యంగా ఉన్న ఏ ఒక్క దేశమూ ఆమెను ఓదార్ఛలేదు. ఆమె స్నేహితులంతా ఆమెపట్ల విముఖులయ్యారు. ఆమె స్నేహితులు ఆమెకు శత్రువులయ్యారు.
విలాప వాక్యములు 1:2 ని అన్వేషించండి
3
విలాప వాక్యములు 1:20
“యెహోవా, నా వైపు చూడు. నేను బాధలో ఉన్నాను! నాలో కలవరం చెలరేగింది! నా గుండె తలక్రిందులైనట్లు నాకు భావన కలుగుతూ వుంది! నా కలవరపాటుకు కారణం నేను మొండిగా తిరిగుబాటు చేయటమే! నా పిల్లలు నడివీధుల్లో కత్తికి గురి అయ్యారు. ఇంటిలోపల మృత్యువు పొంచివుంది.
విలాప వాక్యములు 1:20 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు