1
ప్రసంగి 11:9
పవిత్ర బైబిల్
అందుకని, యువజనులారా, మీ యౌవ్వన కాలంలోనే మీరు సుఖాలు అనుభవించండి. ఆనందంగా ఉండండి! మీ మనస్సుకి ఏది తోస్తే, మీరు ఏది కోరుకుంటే అది చెయ్యండి. అయితే, మీరు చేసే పనులన్నింటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తాడని మాత్రం మరిచిపోకండి.
సరిపోల్చండి
Explore ప్రసంగి 11:9
2
ప్రసంగి 11:10
మీ కోపానికి మీరు లొంగిపోకండి. మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసుకోండి. ప్రజలు జీవిత ప్రారంభ దశలో తాము యౌవనస్థులుగా ఉన్నప్పుడు తెలివిలేని పనులు చేస్తారు.
Explore ప్రసంగి 11:10
3
ప్రసంగి 11:4
(అయితే, కొన్ని విషయాలు నీవు ఖచ్చితంగా తెలుసుకోలేవు. అలాంటప్పుడు, నీవు సాహసించి ఏదో ఒకటి చెయ్యాలి.) మంచి వాతావరణం పరిస్థితులకోసం ఎదురు చూసేవాడు ఎన్నడూ తన విత్తనాలు చల్లలేడు. ప్రతి మేఘమూ వర్షించేస్తుందని భయపడేవాడు తన పంట కుప్పలు ఎన్నడూ నూర్చుకోలేడు.
Explore ప్రసంగి 11:4
4
ప్రసంగి 11:5
గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భంలో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, కాని, అన్నీ జరిపించేది ఆయనే.
Explore ప్రసంగి 11:5
5
ప్రసంగి 11:6
అందుకని, ప్రొద్దుటే నాట్లు వెయ్యడం మొదలెట్టు. సాయంత్రమయ్యేదాకా పని చాలించకు. ఎందుకంటే, ఏవి నిన్ను సంపన్నుని చేస్తాయో నీకు తెలియదు. ఏమో, నీ పనులు అన్నీ జయప్రదమవుతాయేమో.
Explore ప్రసంగి 11:6
6
ప్రసంగి 11:2
నీకున్నది వేర్వేరు వాటిమీద పొదుపు చెయ్యి. ప్రపంచంలో ఏమి చెడుగులు సంభవించనున్నాయో నీకు తెలియదు.
Explore ప్రసంగి 11:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు