1
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:13
పవిత్ర బైబిల్
మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసినవాడనిపిస్తే కోపగించుకోకుండా అతణ్ణి క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
సరిపోల్చండి
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:13
2
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:2-3
మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక భూమ్మీద ఉన్నవాటిని కాకుండా పరలోకంలో ఉన్నవాటిని గురించి ఆలోచించండి.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:2-3
3
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:23
అలా చేసేది మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే మీరు సేవ చేస్తున్నది క్రీస్తు ప్రభువు కోసం.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:23
4
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:12
మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:12
5
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:16-17
క్రీస్తు సందేశాన్ని మీలో సంపూర్ణంగా జీవించనివ్వండి. మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దైవసందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాల్లో కృతజ్ఞతలు తెలుపుకొంటూ స్తుతిగీతాలు, కీర్తనలు పాడుకోండి. వాక్యాలు చదవండి. మాటద్వారా కాని, క్రియా రూపంగా కాని మీరేది చేసినా యేసు ప్రభువు పేరిట చెయ్యండి. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:16-17
6
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:14
అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగ చేస్తుంది.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:14
7
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:1
మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:1
8
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:15
క్రీస్తు కలుగచేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. కృతజ్ఞతతో ఉండండి.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:15
9
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:5
మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:5
10
11
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:8
కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:8
12
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:9-10
మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు కనుక అసత్యములాడరాదు. మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:9-10
13
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:19
పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. వాళ్ళతో కఠినంగా ప్రవర్తించరాదు.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:19
14
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:20
పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల అన్ని విషయాల్లో విధేయతతో ఉండాలి. అప్పుడు వాళ్ళను ప్రభువు మెచ్చుకొంటాడు.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:20
15
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:18
స్త్రీలు తమ భర్తలకు విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి విశ్వాసులు చేయవలసిన విధి.
Explore కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:18
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు