1
రోమా పత్రిక 8:28
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.
సరిపోల్చండి
Explore రోమా పత్రిక 8:28
2
రోమా పత్రిక 8:38-39-38-39
నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.
Explore రోమా పత్రిక 8:38-39-38-39
3
రోమా పత్రిక 8:26
అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు.
Explore రోమా పత్రిక 8:26
4
రోమా పత్రిక 8:31
వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు?
Explore రోమా పత్రిక 8:31
5
రోమా పత్రిక 8:1
ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.
Explore రోమా పత్రిక 8:1
6
రోమా పత్రిక 8:6
శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం.
Explore రోమా పత్రిక 8:6
7
రోమా పత్రిక 8:37
అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం.
Explore రోమా పత్రిక 8:37
8
రోమా పత్రిక 8:18
మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.
Explore రోమా పత్రిక 8:18
9
రోమా పత్రిక 8:35
క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా?
Explore రోమా పత్రిక 8:35
10
రోమా పత్రిక 8:27
ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.
Explore రోమా పత్రిక 8:27
11
రోమా పత్రిక 8:14
దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు.
Explore రోమా పత్రిక 8:14
12
రోమా పత్రిక 8:5
శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు.
Explore రోమా పత్రిక 8:5
13
రోమా పత్రిక 8:32
తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా?
Explore రోమా పత్రిక 8:32
14
రోమా పత్రిక 8:16-17
మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.
Explore రోమా పత్రిక 8:16-17
15
రోమా పత్రిక 8:7
ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా.
Explore రోమా పత్రిక 8:7
16
రోమా పత్రిక 8:19
దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది.
Explore రోమా పత్రిక 8:19
17
రోమా పత్రిక 8:22
ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.
Explore రోమా పత్రిక 8:22
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు