1
మత్తయి 5:15-16
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
సరిపోల్చండి
Explore మత్తయి 5:15-16
2
మత్తయి 5:14
ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు.
Explore మత్తయి 5:14
3
మత్తయి 5:8
పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
Explore మత్తయి 5:8
4
మత్తయి 5:6
నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు.
Explore మత్తయి 5:6
5
మత్తయి 5:44
నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి.
Explore మత్తయి 5:44
6
మత్తయి 5:3
“ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.
Explore మత్తయి 5:3
7
మత్తయి 5:9
శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు.
Explore మత్తయి 5:9
8
మత్తయి 5:4
దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.
Explore మత్తయి 5:4
9
మత్తయి 5:10
నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
Explore మత్తయి 5:10
10
మత్తయి 5:7
కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.
Explore మత్తయి 5:7
11
మత్తయి 5:11-12
“నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.
Explore మత్తయి 5:11-12
12
మత్తయి 5:5
సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.
Explore మత్తయి 5:5
13
మత్తయి 5:13
“లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.
Explore మత్తయి 5:13
14
మత్తయి 5:48
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
Explore మత్తయి 5:48
15
మత్తయి 5:37
మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే.
Explore మత్తయి 5:37
16
మత్తయి 5:38-39
“‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి.
Explore మత్తయి 5:38-39
17
మత్తయి 5:29-30
నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
Explore మత్తయి 5:29-30
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు