1
యెషయా 45:3
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి. చీకటి స్థలాల్లో ఉన్న నిధుల్నీ రహస్యంగా దాచి ఉన్న ధనాన్నీ నీకిస్తాను.
సరిపోల్చండి
Explore యెషయా 45:3
2
యెషయా 45:2
నేను నీకు ముందు వెళ్తూ ఉన్నత స్థలాలను చదును చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనపగడియలను విరగ్గొడతాను.
Explore యెషయా 45:2
3
యెషయా 45:5-6
నేను యెహోవాను, మరి ఏ దేవుడూ లేడు. నేను తప్ప ఏ దేవుడూ లేడు. తూర్పు నుండి పడమటి వరకూ నేను తప్ప ఏ దేవుడూ లేడని మనుషులు తెలుసుకోనేలా నువ్వు నన్ను ఎరుగకపోయినా నిన్ను సిద్ధం చేశాను. నేనే యెహోవాను. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.
Explore యెషయా 45:5-6
4
యెషయా 45:7
వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను.
Explore యెషయా 45:7
5
యెషయా 45:22
భూమి అంచుల వరకూ నివసించే ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుణ్ణి నేనే, మరి ఏ దేవుడూ లేడు.
Explore యెషయా 45:22
6
యెషయా 45:1
యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి ఈ విధంగా చెబుతున్నాడు. “అతని పక్షంగా రాజ్యాలను జయించడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లు విప్పుతాను. ద్వారాలు అతని ఎదుట తెరచి ఉండేలా తలుపులు తీస్తాను.
Explore యెషయా 45:1
7
యెషయా 45:23
నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందనీ, ప్రతి నాలుకా ‘యెహోవా తోడు’ అని అంటుందనీ నేను ప్రమాణం చేశాను. నా న్యాయ వాక్కు బయలుదేరింది. అది వ్యర్ధం కాదు.
Explore యెషయా 45:23
8
యెషయా 45:4
నేను నీకు తెలియకపోయినా నా సేవకుడు యాకోబు కోసం, నేను ఎన్నుకున్న ఇశ్రాయేలు కోసం నేను నిన్ను పేరుతో పిలిచాను. నీకు బిరుదులిచ్చాను.
Explore యెషయా 45:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు