నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల
సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల
నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల
నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి
నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను
తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.