1
యోహాను 10:10
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
సరిపోల్చండి
యోహాను 10:10 ని అన్వేషించండి
2
యోహాను 10:11
నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
యోహాను 10:11 ని అన్వేషించండి
3
యోహాను 10:27
నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
యోహాను 10:27 ని అన్వేషించండి
4
యోహాను 10:28
నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.
యోహాను 10:28 ని అన్వేషించండి
5
యోహాను 10:9
నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
యోహాను 10:9 ని అన్వేషించండి
6
యోహాను 10:14
నేను గొఱ్ఱెల మంచి కాపరిని.
యోహాను 10:14 ని అన్వేషించండి
7
యోహాను 10:29-30
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
యోహాను 10:29-30 ని అన్వేషించండి
8
యోహాను 10:15
తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.
యోహాను 10:15 ని అన్వేషించండి
9
యోహాను 10:18
ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.
యోహాను 10:18 ని అన్వేషించండి
10
యోహాను 10:7
కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
యోహాను 10:7 ని అన్వేషించండి
11
యోహాను 10:12
జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పెట్టి చెదరగొట్టును.
యోహాను 10:12 ని అన్వేషించండి
12
యోహాను 10:1
గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు.
యోహాను 10:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు