నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన
యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును
నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరు
చున్నాను
ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను
నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.