1
ఆదికాండము 11:6-7
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అప్పుడు యెహోవా–ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
సరిపోల్చండి
ఆదికాండము 11:6-7 ని అన్వేషించండి
2
ఆదికాండము 11:4
మరియు వారు–మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించు కొందము రండని మాటలాడుకొనగా
ఆదికాండము 11:4 ని అన్వేషించండి
3
ఆదికాండము 11:9
దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదర గొట్టెను.
ఆదికాండము 11:9 ని అన్వేషించండి
4
ఆదికాండము 11:1
భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
ఆదికాండము 11:1 ని అన్వేషించండి
5
ఆదికాండము 11:5
యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
ఆదికాండము 11:5 ని అన్వేషించండి
6
ఆదికాండము 11:8
ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.
ఆదికాండము 11:8 ని అన్వేషించండి
మీ అనుభవాన్ని వ్యక్తిగతీకృతం చేయడానికి YouVersion కుకీలను ఉపయోగిస్తుంది. మా వెబ్సైట్ ని ఉపయోగించడం ద్వారా, మీరు మా గోప్యతా విధానంలో వివరించబడిన మా కుకీల వాడకాన్ని అంగీకరిస్తారు.
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు