1
యెహెజ్కేలు 18:32
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
సరిపోల్చండి
Explore యెహెజ్కేలు 18:32
2
యెహెజ్కేలు 18:20
పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోషశిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోషశిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.
Explore యెహెజ్కేలు 18:20
3
యెహెజ్కేలు 18:31
మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Explore యెహెజ్కేలు 18:31
4
యెహెజ్కేలు 18:23
దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Explore యెహెజ్కేలు 18:23
5
యెహెజ్కేలు 18:21
అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.
Explore యెహెజ్కేలు 18:21
6
యెహెజ్కేలు 18:9
యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల ననుసరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Explore యెహెజ్కేలు 18:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు