దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.
–నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి
దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
–కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి
ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని
ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. –మరియు
నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై
యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై
యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.