ఉచిత పఠన ప్రణాళికలు మరియు కీర్తనలు 46:10 కు సంబంధించిన వాక్య ధ్యానములు

అంతా ప్రశాంతం: ఈ క్రిస్మస్ వేళలో యేసుని సమాధానము పొందుకొనుట
5 రోజులు
ఈ పండుగ కాలము కేవలము ఉల్లాసభరితమైనదే కాక తీరిక కూడా దొరకని హడావుడి సమయము. ఈ పండుగ కాలపు పనుల వత్తిడి నుండి సేద దీరి ఆనందపు ఘడియలలో కొనసాగుటకు మన పనులను ప్రక్కన పెట్టి కొంత సమయము ఆయనను ఆరాధిద్దాము. అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్: ఎడ్వెంట్ డివోషనల్ అను పుస్తకం ఆధారంగా, ఈ 5-రోజుల ఆధ్యాత్మిక పఠన ప్రణాళిక ఆయన మంచితనమును గుర్తు చేసుకొనుటకు, మనకు ఆయన యొక్క అవసరతను తెలుపుతూ, ఆయన నెమ్మదిని కనుగొనుటకు, మరియు ఆయన నమ్మకత్వమును విశ్వసిస్తూ ఈ క్రిస్మస్ సమయములో యేసు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకొనుటకు మిమ్మును నడిపించును.

విశ్రాంతి కొరకు సమయమును కేటాయించుట
5 రోజులు
మితిమీరిన పనితనం మరియు ఎల్లప్పుడు బిజీగా ఉండే తత్వం లాంటివి మన సమాజంలో తరచుగా ప్రశంసలు పొందుకొనును, కావున విశ్రాంతి అనేది ఇప్పుడు ఒక సవాలుగా మారింది. మన యొక్క బాధ్యతలు మరియు ఉద్దేశ్యములను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే, విశ్రాంతి తీసుకోవటం మనం నేర్చుకోవాలి లేనిచో మనం ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకొనుటకు మరియు మనం ప్రేమించే వ్యక్తులకు మనవంతుగా ఇవ్వటానికి ఏమి మిగిలియుండదు. కాబట్టి ఈ విశ్రాంతిని గూర్చి నేర్చుకొనుటకు మరియు మనము నేర్చుకొనిన దానిని మన జీవితాలలో ఎలా అవలంబించాలో రాబోయే ఐదు రోజులలో తెలుసుకుందాము.

నిరీక్షణ స్వరం
7 రోజులు
అనబడే ఈ ఆడియో వాహిని శీర్షిక మిమ్ములను ఉత్సాహ పరచుటకు మరియు ఇటువంటి సమయంలో మిమ్ములను నిరీక్షణ యందు అభివృద్ధి పరచుటకు చేయబడినదై యున్నది కాబట్టి దయచేసి వినండి, ఆశీర్వదించబడండి. 'Voice of hope' is audio series of encouragement and hope for a time such as this. Listen and be blessed!

ప్రభువునందు విశ్రమించుట
7 రోజులు
ఈ ప్రపంచంలోని వ్యాపారం మరియు వెర్రితనంలో విశ్రాంతిని పొందడం ఎలా సాధ్యం? ఈ ప్రపంచ గందరగోళంలో మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం? మనం ఎక్కడ మరియు ఎలా శాంతి మరియు విశ్రాంతిని పొందవచ్చో దేవుని వాక్యం మనకు చూపుతుంది. ఈ పఠన ప్రణాళికలో, ప్రభువులో విశ్రాంతిని కనుగొనడానికి నేను మిమ్మల్ని ఒక ప్రయాణంలో తీసుకెళ్లాలనుకుంటున్నాను.