ఉచిత పఠన ప్రణాళికలు మరియు గలతీయులకు 5:16 కు సంబంధించిన వాక్య ధ్యానములు

దేవునికి మొదటి స్థానం ఇవ్వండి
5 రోజులు
మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అనేది ఏదో ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు... ఇది ప్రతి క్రైస్తవునికి జీవిత కాలపు ప్రక్రియ. మీరు విశ్వాసములో క్రొత్తవారైనా, లేదా క్రీస్తును అనేక సంవత్సరాలుగా వెంబడిస్తున్నవారైనా, అర్థం చేసుకొని అవలంబించటానికి ఈ ప్రణాళిక మీకు సులభంగా ఉంటుంది. మరియు ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితాలు జీవించటానికి అత్యంత ప్రభావవంతమైన ప్రణాళికగా ఉంటుంది. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సేకరించబడింది.

వైఖరి
7 రోజులు
ప్రతి పరిస్థితిలో సరైన వైఖరి కలిగి ఉండటం ఒక నిజమైన సవాలు. అనుదినము చిన్న ప్రకరణము చదువుట ద్వారా ఈ ఏడు రోజుల ప్రణాళిక మీకు సరైన బైబిల్ దృక్కోణాన్ని ఇస్తుంది. ప్రకరణము చదివి, నిజాయితీగా మిమ్మల్ని పరిశీలించుకొనుటకు సమయము గడపండి, మీ యొక్క పరిస్థితిని గూర్చి దేవుడిని మాట్లాడనివ్వండి. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి
