1
మత్తయి 27:46
తెలుగు సమకాలీన అనువాదము
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు “నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు?” అని అర్థం.
Uporedi
Istraži మత్తయి 27:46
2
మత్తయి 27:51-52
ఆ క్షణంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి.
Istraži మత్తయి 27:51-52
3
మత్తయి 27:50
యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు.
Istraži మత్తయి 27:50
4
మత్తయి 27:54
శతాధిపతి మరియు అతనితో కూడ యేసుకు కాపలా కాస్తున్నవారు వచ్చిన భూకంపాన్ని మరియు జరిగిన కార్యాలన్నిటిని చూసి, వారు భయపడి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అని చెప్పుకొన్నారు.
Istraži మత్తయి 27:54
5
మత్తయి 27:45
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.
Istraži మత్తయి 27:45
6
మత్తయి 27:22-23
అందుకు పిలాతు, “అలాగైతే క్రీస్తు అనబడిన యేసును, ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “సిలువ వేయండి!” అని కేకలు వేశారు. “ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు. అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
Istraži మత్తయి 27:22-23
Početna
Biblija
Planovi
Video zapisi