1
మత్తయి 7:7
తెలుగు సమకాలీన అనువాదము
“అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి, మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.
Σύγκριση
Διαβάστε మత్తయి 7:7
2
మత్తయి 7:8
ఎందుకంటే, అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది.
Διαβάστε మత్తయి 7:8
3
మత్తయి 7:24
“కావున నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసే ప్రతి ఒక్కరు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని లాంటివారు.
Διαβάστε మత్తయి 7:24
4
మత్తయి 7:12
కనుక అన్ని విషయాలలో, ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి, ఎందుకంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు చెప్పిన సారాంశం ఇదే.
Διαβάστε మత్తయి 7:12
5
మత్తయి 7:14
అయితే జీవానికి వెళ్లే ద్వారం చిన్నగా, దాని దారి ఇరుకుగా ఉంటుంది, కొంతమందే దాని కనుగొంటారు.
Διαβάστε మత్తయి 7:14
6
మత్తయి 7:13
“ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, దారి విశాలంగా ఉంటుంది, అనేకమంది దానిలోనికి ప్రవేశిస్తారు.
Διαβάστε మత్తయి 7:13
7
మత్తయి 7:11
మీరు చెడ్డవారైనప్పటికీ, మీ పిల్లలకు మంచి బహుమతులను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారు!
Διαβάστε మత్తయి 7:11
8
మత్తయి 7:1-2
“తీర్పు తీర్చకండి, అప్పుడు మీకు కూడ తీర్పు తీర్చబడదు. మీరు ఇతరులకు తీర్పు తీర్చినట్లే, మీకు తీర్పు తీర్చబడుతుంది, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.
Διαβάστε మత్తయి 7:1-2
9
మత్తయి 7:26
కానీ నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని లాంటివారు.
Διαβάστε మత్తయి 7:26
10
మత్తయి 7:3-4
“నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు? ఎప్పుడూ నీ కంటిలో దూలాన్ని ఉంచుకొని నీ సహోదరునితో, ‘నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు?’ అని నీవెలా అనగలవు?
Διαβάστε మత్తయి 7:3-4
11
మత్తయి 7:15-16
“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. ముళ్లపొదల్లో ద్రాక్షపండ్లను, పల్లేరు మొక్కల్లో అంజూరపు పండ్లను ప్రజలు కోస్తారా?
Διαβάστε మత్తయి 7:15-16
12
మత్తయి 7:17
అలాగే, ప్రతి మంచిచెట్టు మంచిపండ్లు కాస్తుంది. చెడ్డచెట్టు చెడ్డపండ్లు కాస్తుంది.
Διαβάστε మత్తయి 7:17
13
మత్తయి 7:18
మంచిచెట్టు చెడ్డపండ్లు కాయదు, చెడ్డచెట్టు మంచిపండ్లు కాయదు.
Διαβάστε మత్తయి 7:18
14
మత్తయి 7:19
మంచిపండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది.
Διαβάστε మత్తయి 7:19
Αρχική
Αγία Γραφή
Σχέδια
Βίντεο