Logo YouVersion
Ikona vyhledávání

Oblíbené biblické verše z యోహాను 21

వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోను, వీటన్నింటి కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. అతడు “అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు. అయితే “నా గొర్రెపిల్లలను మేపుము” అని యేసు చెప్పారు. మరల యేసు, “యోహాను కుమారుడవైన సీమోను, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?” అని రెండవ సారి అడిగారు. అతడు “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను కాయుము” అన్నారు. యేసు మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. యేసు తనని మూడవసారి “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగినందుకు బాధపడిన పేతురు, “ప్రభువా, నీవు అన్ని తెలిసినవాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను మేపుము”

Bezplatné plány čtení Bible a zamyšlení související s యోహాను 21