YouVersion Logo
Search Icon

కీర్తనలు 118

118
1యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము
నిలుచును
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
2ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు
అందురు గాక.
3ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ
స్థులు అందురు గాక.
4ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా
యందు భయభక్తులుగలవారు అందురు గాక.
5ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని
విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను
6యెహోవా నా పక్షముననున్నాడు నేను భయ
పడను
నరులు నాకేమి చేయగలరు?
7యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై
యున్నాడు
నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట
చూచెదను.
8మనుష్యులను నమ్ముకొనుటకంటె
యెహోవాను ఆశ్రయించుట మేలు.
9రాజులను నమ్ముకొనుటకంటె
యెహోవాను ఆశ్రయించుట మేలు.
10అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు
యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము
చేసెదను.
11నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు
యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము
చేసెదను.
12కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు
ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లువారు నశించి
పోయిరి
యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము
చేసెదను.
13నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి
యెహోవా నాకు సహాయము చేసెను.
14యెహోవా నా దుర్గము నా గానము
ఆయన నాకు రక్షణాధారమాయెను.
15నీతిమంతుల గుడారములలో రక్షణనుగూర్చిన
ఉత్సాహ సునాదము వినబడును
యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను
చేయును.
16యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను
యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను
చేయును.
17నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ
రించెదను.
18యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని
ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.
19నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి
నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా
స్తుతులు చెల్లించెదను.
20ఇది యెహోవా గుమ్మము
నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.
21నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి
యున్నావు
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
22ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి
మూలకు తలరాయి ఆయెను.
23అది యెహోవావలన కలిగినది
అది మన కన్నులకు ఆశ్చర్యము
24ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము
దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
25యెహోవా, దయచేసి నన్ను రక్షించుము
యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.
26యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును
గాక
యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు
చున్నాము.
27యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను
గ్రహించియున్నాడు
ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు
కట్టుడి.
28నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించెదను
నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.
29యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము
నిలుచుచున్నది
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 118