1
యెషయా 42:6-7-6-7
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
“యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను; నేను నీ చేయి పట్టుకుంటాను. గుడ్డివారి కళ్లు తెరవడానికి, చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి, చీకటి గుహల్లో నివసించేవారిని బయటకు తీసుకురావడానికి, నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, యూదేతరులకు వెలుగుగా చేస్తాను.
Compare
Explore యెషయా 42:6-7-6-7
2
యెషయా 42:8
“నేనే యెహోవాను. అదే నా పేరు! నా మహిమను నేను మరొకరికి ఇవ్వను నాకు రావలసిన స్తుతులను విగ్రహాలకు చెందనివ్వను.
Explore యెషయా 42:8
3
యెషయా 42:1
“ఇదిగో, నేను నిలబెట్టుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
Explore యెషయా 42:1
4
యెషయా 42:3-4
నలిగిన రెల్లును అతడు విరువడు, మసకగా వెలుగుతున్న వత్తిని ఆర్పడు. అతడు నమ్మకంగా న్యాయాన్ని చేస్తాడు; భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకు అతడు అలసిపోడు నిరుత్సాహపడడు. అతని బోధలో ద్వీపాలు నిరీక్షణ కలిగి ఉంటాయి.”
Explore యెషయా 42:3-4
5
యెషయా 42:16
గ్రుడ్డివారిని వారికి తెలియని దారుల్లో తీసుకెళ్తాను, తెలియని మార్గాల్లో నేను వారిని నడిపిస్తాను. వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర దారులను చక్కగా చేస్తాను. నేను ఈ కార్యాలు చేస్తాను; నేను వారిని విడిచిపెట్టను.
Explore యెషయా 42:16
6
యెషయా 42:9
చూడండి, గతంలో చెప్పిన సంగతులు జరిగాయి. క్రొత్త సంగతులు నేను తెలియజేస్తున్నాను. అవి జరగకముందే వాటిని మీకు తెలియజేస్తాను.”
Explore యెషయా 42:9
Home
Bible
Plans
Videos