అందుకే,
“వీరు దేవుని సింహాసనం ముందు ఉండి,
ఆయన ఆలయంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు,
కనుక ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాడు
తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.
‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు
దాహం ఉండదు;
సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగులదు,’
ఏ వేడి వారిని కాల్చదు.