1
లూకా 8:15
తెలుగు సమకాలీన అనువాదము
అయితే మంచినేలలో పడిన విత్తనాలు యోగ్యులై మంచి హృదయం కలిగినవారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని పాటిస్తారు, పట్టుదలతో ఫలిస్తారు.”
Compare
Explore లూకా 8:15
2
లూకా 8:14
ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఎవరంటే, వారు వాక్యాన్ని వింటారు, కాని కాలం గడిచేకొలది తమ జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ఐశ్వర్యాలు మరియు ఆనందాలతో అణిచివేయబడడంవల్ల, వాక్యంలో ఎదగరు.
Explore లూకా 8:14
3
లూకా 8:13
రాతి నేలలో పడిన విత్తనాలు ఎవరంటే, వారు వాక్యన్ని విన్నప్పుడు దానిని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు ఉండదు. వారు కొంతకాలమే నమ్ముతారు, శోధన సమయంలో త్వరగా పడిపోతారు.
Explore లూకా 8:13
4
లూకా 8:25
అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అని తన శిష్యులను అడిగారు. అయితే వారు విస్మయంతో భయపడుతు ఒకనితో ఒకడు, “ఈయన ఎవరు? గాలిని నీళ్ళను ఈయన ఆజ్ఞాపించగానే, అవి లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.
Explore లూకా 8:25
5
లూకా 8:12
దారి ప్రక్కన పడిన విత్తనాలు ఎవరంటే, వారు వాక్యాన్ని వింటారు, కానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు.
Explore లూకా 8:12
6
లూకా 8:17
ఎందుకంటే మరుగున ఉంచినదేది బయటపడక ఉండదు, దాచిపెట్టబడినదేది తెలియకుండా లేక బహిర్గతం కాకుండ ఉండదు.
Explore లూకా 8:17
7
లూకా 8:47-48
అప్పుడు ఆ స్త్రీ, ఇక దాగి ఉండలేనని తెలిసి, వణుకుతు వచ్చి ఆయన పాదాల యెదుట సాగిలపడింది. ఆమె ఎందుకు ఆయనను ముట్టుకుందో మరియు వెంటనే ఎలా స్వస్థత పొందిందో ప్రజలందరి ముందు చెప్పింది. అప్పుడు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు” అని చెప్పారు.
Explore లూకా 8:47-48
8
లూకా 8:24
కనుక శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, బోధకుడా, మేము మునిగిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, ఉప్పొంగుతున్న నీటిని మరియు గాలిని గద్దించగానే, తుఫాను ఆగింది, అంతా ప్రశాంతంగా మారింది.
Explore లూకా 8:24
Home
Bible
Plans
Videos