1
లూకా 6:38
తెలుగు సమకాలీన అనువాదము
ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. అణిచి, కుదిపి, పొర్లిపారునట్లు నిండు కొలత మీ ఒడిలో పోయబడుతుంది. ఎందుకంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.”
Compare
Explore లూకా 6:38
2
లూకా 6:45
మంచివారు తమ హృదయంలో నిండివున్న మంచి నుండి మంచివాటినే బయటికి తెస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయంలో నిండివున్న చెడు నుండి చెడ్డవాటినే బయటికి తెస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండివుందో దానినే నోరు మాట్లాడుతుంది.
Explore లూకా 6:45
3
లూకా 6:35
మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేని వారికి మరియు దుష్టులకు దయ చూపించేవాడు.
Explore లూకా 6:35
4
లూకా 6:36
మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం గలవారై ఉండండి.
Explore లూకా 6:36
5
లూకా 6:37
“తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఖండించకండి, మీరు ఖండించబడరు. క్షమించండి, మీరు క్షమించబడతారు.
Explore లూకా 6:37
6
లూకా 6:27-28
“అయితే వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే: మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థించండి.
Explore లూకా 6:27-28
7
లూకా 6:31
ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి.
Explore లూకా 6:31
8
లూకా 6:29-30
ఒకడు నిన్ను ఒక చెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు. ఒకవేళ ఒకడు నీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వానికి నీ అంగీని ఇవ్వకుండా వెనుకకు తీసుకోవద్దు. నిన్ను అడిగే ప్రతివానికి ఇవ్వు, మరియు ఒకవేళ ఎవరైన నీకు చెందిన దానిని తీసుకుంటే, దాన్ని మళ్ళీ అడగవద్దు.
Explore లూకా 6:29-30
9
లూకా 6:43
“ఏ మంచిచెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డచెట్టు మంచిపండ్లు కాయదు.
Explore లూకా 6:43
10
లూకా 6:44
ప్రతి చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. ప్రజలు ముండ్ల పొదలలో అంజూరపు పండ్లను, లేక గచ్చ పొదలలో ద్రాక్షపండ్లను కోయరు.
Explore లూకా 6:44
Home
Bible
Plans
Videos