1
ఎఫెసీయులకు 6:12
తెలుగు సమకాలీన అనువాదము
ఎందుకంటే, మనం పోరాడేది శరీరులతో కాదు, కాని పాలకులతో, అధికారులతో, ఈ చీకటి లోకపు శక్తులతో ఆకాశమండలంలో ఉన్న దురాత్మల బలగాలతో వ్యతిరేకంగా పోరాడుతున్నాం.
Compare
Explore ఎఫెసీయులకు 6:12
2
ఎఫెసీయులకు 6:18
ఆత్మలో అన్ని సందర్భాలలో అన్ని రకాల ప్రార్థనలతో విన్నపాలతో ప్రార్థించండి. దీన్ని మనస్సులో ఉంచుకొని, మెలకువగా ఉండి ప్రభువు యొక్క ప్రజలందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండండి.
Explore ఎఫెసీయులకు 6:18
3
ఎఫెసీయులకు 6:11
మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
Explore ఎఫెసీయులకు 6:11
4
ఎఫెసీయులకు 6:13
అందుకే ఆపద రోజున మీరు వారిని ఎదిరించడానికి, శక్తిమంతులుగా నిలబడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
Explore ఎఫెసీయులకు 6:13
5
ఎఫెసీయులకు 6:16-17
వీటితో పాటు, విశ్వాసమనే డాలు పట్టుకోండి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి.
Explore ఎఫెసీయులకు 6:16-17
6
ఎఫెసీయులకు 6:14-15
స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకొని, నీతి అనే కవచాన్ని తొడుగుకొని, పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే జోళ్ళను తొడుగుకొని నిలబడండి.
Explore ఎఫెసీయులకు 6:14-15
7
ఎఫెసీయులకు 6:10
చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై యుండండి.
Explore ఎఫెసీయులకు 6:10
8
ఎఫెసీయులకు 6:2-3
“మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. దాని వలన మీకు మేలు కలుగుతుంది, మీరు సంతోషంగా భూమి మీద దీర్ఘాయువు కలిగి జీవిస్తారు.”
Explore ఎఫెసీయులకు 6:2-3
9
ఎఫెసీయులకు 6:1
పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై యుండండి, అది సరియైనది.
Explore ఎఫెసీయులకు 6:1
Home
Bible
Plans
Videos