1
రోమీయులకు వ్రాసిన లేఖ 14:17-18
పవిత్ర బైబిల్
దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు.
Compare
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 14:17-18
2
రోమీయులకు వ్రాసిన లేఖ 14:8
మనం మరణించేది ప్రభువు కోసం మరణిస్తున్నాము. అందువల్ల మనం మరణించినా, జీవించినా ప్రభువుకు చెందిన వాళ్ళమన్నమాట.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 14:8
3
రోమీయులకు వ్రాసిన లేఖ 14:19
అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారి తీసే కార్యాలను చేద్దాం.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 14:19
4
రోమీయులకు వ్రాసిన లేఖ 14:13
కాబట్టి ఇతర్లపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 14:13
5
రోమీయులకు వ్రాసిన లేఖ 14:11-12
దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రభువు ఈ విధంగా అన్నాడు: నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను. నా ముందు అందరూ మోకరిల్లుతారు, దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది.” అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 14:11-12
6
రోమీయులకు వ్రాసిన లేఖ 14:1
సంపూర్ణమైన విశ్వాసం లేనివాణ్ణి నిరాకరించకండి. వాదగ్రస్థమైన సంగతుల్ని విమర్శించకండి.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 14:1
7
రోమీయులకు వ్రాసిన లేఖ 14:4
ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 14:4
Home
Bible
Plans
Videos