1
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:3-4
పవిత్ర బైబిల్
స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.
Compare
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:3-4
2
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:5
యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:5
3
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:6-8
ఆయన దేవునితో సమానము. అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు. ఆయన అంతా వదులుకొన్నాడు. మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు. మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ, మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:6-8
4
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:13
దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:13
5
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:9-11
అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు. యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు. తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:9-11
6
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:14-15
మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై, నీతి లేకుండా జీవిస్తున్న వీళ్ళ మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డల్లా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:14-15
7
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:12
నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:12
Home
Bible
Plans
Videos