1
యాకోబు వ్రాసిన లేఖ 3:17
పవిత్ర బైబిల్
కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది.
Compare
Explore యాకోబు వ్రాసిన లేఖ 3:17
2
యాకోబు వ్రాసిన లేఖ 3:13
జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి.
Explore యాకోబు వ్రాసిన లేఖ 3:13
3
యాకోబు వ్రాసిన లేఖ 3:18
శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.
Explore యాకోబు వ్రాసిన లేఖ 3:18
4
యాకోబు వ్రాసిన లేఖ 3:16
ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి.
Explore యాకోబు వ్రాసిన లేఖ 3:16
5
యాకోబు వ్రాసిన లేఖ 3:9-10
మనం, మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము. స్తుతి, శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా! ఇది తప్పు.
Explore యాకోబు వ్రాసిన లేఖ 3:9-10
6
యాకోబు వ్రాసిన లేఖ 3:6
నాలుక నిప్పులాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీరమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం నుండి పొందుతుంది.
Explore యాకోబు వ్రాసిన లేఖ 3:6
7
యాకోబు వ్రాసిన లేఖ 3:8
కాని నాలుకను ఎవ్వరూ మచ్చిక చేసుకోలేదు. అది ప్రాణాంతకమైన విషంతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. విరామం లేకుండా ఉంటుంది.
Explore యాకోబు వ్రాసిన లేఖ 3:8
8
యాకోబు వ్రాసిన లేఖ 3:1
నా సోదరులారా! దేవుడు మిగతావాళ్ళకన్నా, బోధించే మనల్ని కఠినంగా శిక్షస్తాడని మీకు తెలుసు. కనుక అందరూ బోధకులు కావాలని ఆశించకండి.
Explore యాకోబు వ్రాసిన లేఖ 3:1
Home
Bible
Plans
Videos