జన్మించి, కొన్నాళ్లు మాత్రమే జీవించే శిశువు అంటూ ఎవ్వరు ఆ పట్టణంలో ఉండరు.
కొన్నాళ్లకే ఆయుష్షు తీరిపోయే వ్యక్తులు ఎవ్వరూ ఆ పట్టణంలో ఉండరు.
జన్మించే ప్రతి శిశువు దీర్ఘకాలం జీవిస్తుంది.
వృద్ధులు ప్రతి ఒక్కరూ చాలాకాలం జీవిస్తూనే ఉంటారు.
వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి యువకుడు అని పిలువబడతాడు.
(అయితే పాపం చేసినవాడు వంద సంవత్సరాలు బ్రతికినా అన్నీ కష్టాలే.)