1
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:12
పవిత్ర బైబిల్
నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు.
Compare
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:12
2
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:10
ధనాశ అన్ని రకాల దుష్టత్వానికి మూలకారణం. కొందరు, ధనాన్ని ప్రేమించి, క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసానికి దూరమైపోయారు. తద్వారా దుఃఖాల్లో చిక్కుకుపోయారు.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:10
3
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:6
కాని సంతృప్తితో ఉండి, భక్తిని అవలంభిస్తే అదే ఒక గొప్ప ధనము.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:6
4
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:7
ఈ లోకంలోకి మనమేమీ తీసుకురాలేదు. ఈ లోకంనుండి ఏమీ తీసుకుపోలేము.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:7
5
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:17
ధనవంతులు గర్వించరాదనీ, క్షణికమైన ధనాన్ని నమ్మకూడదనీ, వాళ్ళతో చెప్పుదానికి మారుగా మన ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని ఆజ్ఞాపించు.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:17
6
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:9
కాని ధనవంతులు కావాలనుకొనేవారు, ఆశలకులోనై మూర్ఖత్వంతో హానికరమైన ఆశల్లో చిక్కుకుపోతారు. అవి వాళ్ళను అధోగతి పట్టించి పూర్తిగా నాశనం చేస్తాయి.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:9
7
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:18-19
సత్కార్యాలు చేస్తూ సత్ ప్రవర్తన కలిగి అవసరమైనవాటిని యితర్లతో ఔదార్యముగా పంచుకుంటూ ఉండుమని ఆజ్ఞాపించు. ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందకల్గుతారు.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6:18-19
Home
Bible
Plans
Videos