1
ప్రసంగి 3:1
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది.
Compare
Explore ప్రసంగి 3:1
2
ప్రసంగి 3:2-3
పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ
Explore ప్రసంగి 3:2-3
3
ప్రసంగి 3:4-5
ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ
Explore ప్రసంగి 3:4-5
4
ప్రసంగి 3:7-8
వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ ప్రేమించడానికీ, ద్వేషించడానికీ యుద్ధం చేయడానికీ, సంధి చేసుకోడానికీ ఇలా ప్రతిదానికీ ఒక సమయం ఉంది.
Explore ప్రసంగి 3:7-8
5
ప్రసంగి 3:6
వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ
Explore ప్రసంగి 3:6
6
ప్రసంగి 3:14
దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు.
Explore ప్రసంగి 3:14
7
ప్రసంగి 3:17
“మంచివారికీ చెడ్డవారికీ వారి ప్రతి ప్రయత్నానికీ, పనికీ తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు” అని నా హృదయంలో అనుకున్నాను.
Explore ప్రసంగి 3:17
Home
Bible
Plans
Videos