విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు
నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు
దాసులై యెహోవా నామమును ప్రేమించుచు
ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున
చేరు అన్యులను
నా పరిశుద్ధపర్వతమునకు తోడుకొని వచ్చెదను
నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను
నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు
లును నాకు అంగీకారములగును
నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన
బడును.