1
ఆది 25:23
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా ఆమెతో ఇలా చెప్పారు, “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.”
አወዳድር
{{ጥቅስ}} ያስሱ
2
ఆది 25:30
“నేను చాలా ఆకలితో ఉన్నాను, నీవు వండుచున్న ఆ ఎర్రని కూర కొంచెం నాకు పెట్టు!” అని అడిగాడు, (అందుకే అతనికి ఎదోము అని పేరు వచ్చింది.)
3
ఆది 25:21
రిబ్కాకు సంతానం కలుగలేదు కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చారు, అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది.
4
ఆది 25:32-33
అప్పుడు ఏశావు, “నేను ఆకలితో చస్తూ ఉంటే నాకు జ్యేష్ఠత్వం దేనికి ఉపయోగం?” అని అన్నాడు. అయితే యాకోబు, “ముందు నాకు ప్రమాణం చేయి” అన్నాడు. కాబట్టి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మివేస్తున్నట్టుగా ప్రమాణం చేశాడు.
5
ఆది 25:26
తర్వాత అతని సోదరుడు, అతని మడిమెను పట్టుకుని బయటకు వచ్చాడు, అతనికి యాకోబు అని పేరు పెట్టారు. రిబ్కా వారికి జన్మనిచ్చినప్పుడు ఇస్సాకు వయస్సు అరవై సంవత్సరాలు.
6
ఆది 25:28
ఇస్సాకు వేటాడిన మాంసం కోరుకునేవాడు, అతడు ఏశావును ప్రేమించేవాడు, కానీ రిబ్కా యాకోబును ప్రేమించేది.
Home
Bible
Plans
Videos